బద్వేలులో ఓటర్లను అద్దెకు తెచ్చి దొంగ ఓట్లు వేయించారు: జీవీఎల్

  • బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక
  • నిన్న ముగిసిన పోలింగ్
  • అధికార దుర్వినియోగం జరిగిందన్న జీవీఎల్
  • పోలీసులు అధికార పార్టీకి సహకరించారని ఆరోపణ
కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ నిన్న ముగిసింది. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీపై ధ్వజమెత్తారు. ఓటర్లను అద్దెకు తెచ్చి దొంగ ఓట్లు వేయించారని ఆరోపించారు. బద్వేలులో అధికార దుర్వినియోగం జరిగిందని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి సహకరించారని వెల్లడించారు. వైసీపీ అక్రమాలపై ఆధారాలు ఇచ్చామని, 28 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

GVL Narasimha Rao
Badvel
By Election
YSRCP
Police
BJP
Andhra Pradesh

More Telugu News